Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 08:27 PM

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి: సంగారెడ్డి ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎమ్మెల్యే ,ఆందోల్ మాజీ ఎమ్మెల్యే

17-08-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పెదటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలిచాయని, హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ వాటిని నిలిపివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదని విమర్శించారు.పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ పేద ఆడబిడ్డలకు అండగా నిలిచే ఈ పథకాలను కొనసాగించాలని, వాటిని రద్దు చేసే ప్రయత్నాలను బీఆర్‌ఎస్ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. పథకాలను కొనసాగించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Sthanikam

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి: సంగారెడ్డి ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎమ్మెల్యే ,ఆందోల్ మాజీ ఎమ్మెల్యే

Article Image

పెదటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలిచాయని, హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ వాటిని నిలిపివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదని విమర్శించారు.పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ పేద ఆడబిడ్డలకు అండగా నిలిచే ఈ పథకాలను కొనసాగించాలని, వాటిని రద్దు చేసే ప్రయత్నాలను బీఆర్‌ఎస్ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. పథకాలను కొనసాగించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News