Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు.. నూతన కమిటీ సభ్యులకు సన్మానం

16-08-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

భారత మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు మినహాజ్ బుట్టు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా మినహాజ్ బుట్టు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్‌పేయి గొప్ప రాజనీతిజ్ఞుడు, కవి, ప్రజానాయకుడిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని, అందరినీ కలుపుకుని ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత అని అన్నారు.సుపరిపాలన, దేశాభివృద్ధి కోసం వాజ్‌పేయి చూపిన మార్గంలో ముందుకు సాగుతామని తెలిపారు. పోఖ్రాన్ అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి రహదారుల ప్రాజెక్టు వంటి ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం బీజేపీ సంగారెడ్డి జిల్లా మైనారిటీ మోర్చాకు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మైనారిటీ మోర్చా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు.. నూతన కమిటీ సభ్యులకు సన్మానం

Article Image

భారత మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు మినహాజ్ బుట్టు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా మినహాజ్ బుట్టు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్‌పేయి గొప్ప రాజనీతిజ్ఞుడు, కవి, ప్రజానాయకుడిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని, అందరినీ కలుపుకుని ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత అని అన్నారు.సుపరిపాలన, దేశాభివృద్ధి కోసం వాజ్‌పేయి చూపిన మార్గంలో ముందుకు సాగుతామని తెలిపారు. పోఖ్రాన్ అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి రహదారుల ప్రాజెక్టు వంటి ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం బీజేపీ సంగారెడ్డి జిల్లా మైనారిటీ మోర్చాకు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మైనారిటీ మోర్చా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News