Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

గొల్ల–కురుమలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరని అన్యాయం: బీఎస్పీ మునుగోడు ఇన్‌చార్జి ఐతరాజు అభేందర్

16-08-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నారాయణపురంలో దొడ్డి కొమరయ్య విగ్రహం వద్ద బీఎస్పీ నిరసన

ఎన్నికల వేళ గొల్ల–కురుమలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) తీవ్రస్థాయిలో డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం కాలయాపన ధోరణి వీడకపోవడం వల్ల గొల్ల–కురుమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయని బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి ఐతరాజు అభేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ​మండల కేంద్రంలోని దొడ్డి కొమరయ్య విగ్రహం వద్ద బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల పెంపకందారులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. హామీల అమలులో జరుగుతున్న జాప్యం వారి జీవనోపాధిపై కోలుకోలేని దెబ్బతీస్తోందని విమర్శించారు. కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా, పెండింగ్‌లో ఉన్న పథకాలను క్షేత్రస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు స్పష్టమైన కాలపట్టికను (యాక్షన్ ప్లాన్) తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గొల్ల–కురుమల హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఎస్పీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల గిరి, ఉపాధ్యక్షుడు గొంది గళ్ళ కృష్ణ, గొల్ల–కురుమ సంఘం అధ్యక్షుడు బండారి నరసింహ, నాయకులు వెంకటేష్, శంకర్, రాజు, నరసింహ, మల్లయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గొల్ల–కురుమలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరని అన్యాయం: బీఎస్పీ మునుగోడు ఇన్‌చార్జి ఐతరాజు అభేందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News