ఆందోల్ నియోజకవర్గంలో రేగోడ్ గ్రామానికి చెందిన అంజనా భారతి భరతనాట్యంలో ప్రతిభ కనబరుస్తూ గ్రామానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. లింగాపురం గ్రామానికి చెందిన జ్యోతి–అరవింద్ రావు దంపతుల కుమార్తె అయిన అంజనా భారతి చిన్న వయస్సు నుంచే భరతనాట్యంపై ఆసక్తి పెంచుకుని క్రమం తప్పకుండా సాధన చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన “తెలంగాణ తల్లికి వందనం–భరతనాట్య అభినందన” కార్యక్రమంలో సంప్రదాయ నృత్య వేషధారణలో అంజనా భారతి చేసిన భరతనాట్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.ఆమె ప్రతిభను పలువురు అభినందించారు. భవిష్యత్తులో భరతనాట్యంలో మరిన్ని ఉన్నత అవకాశాలు అందుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆకాంక్షించారు. అంజనా భారతి ప్రతిభ పట్ల రేగోడ్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
PRINT TIME: October 09, 2026 03:10 AM
చిన్న వయస్సులోనే భరతనాట్యంలో ప్రతిభ చాటిన అంజనా భారతి

16-08-2026
46 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
ఆందోల్ నియోజకవర్గంలో రేగోడ్ గ్రామానికి చెందిన అంజనా భారతి భరతనాట్యంలో ప్రతిభ కనబరుస్తూ గ్రామానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. లింగాపురం గ్రామానికి చెందిన జ్యోతి–అరవింద్ రావు దంపతుల కుమార్తె అయిన అంజనా భారతి చిన్న వయస్సు నుంచే భరతనాట్యంపై ఆసక్తి పెంచుకుని క్రమం తప్పకుండా సాధన చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన “తెలంగాణ తల్లికి వందనం–భరతనాట్య అభినందన” కార్యక్రమంలో సంప్రదాయ నృత్య వేషధారణలో అంజనా భారతి చేసిన భరతనాట్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.ఆమె ప్రతిభను పలువురు అభినందించారు. భవిష్యత్తులో భరతనాట్యంలో మరిన్ని ఉన్నత అవకాశాలు అందుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆకాంక్షించారు. అంజనా భారతి ప్రతిభ పట్ల రేగోడ్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి