Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:36 AM

పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ

14-08-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అమరావతి భవనాల ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం దూరం

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ గైర్హాజరు చర్చనీయాంశంగా మారింది. అమరావతిలో సీఎం చంద్రబాబు పాల్గొన్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు పవన్‌ కళ్యాణ్‌ హాజరు కాలేదు.

అమరావతి స్టీల్‌ బ్రిడ్జి, ఎమ్మెల్యేల క్వార్టర్లు, సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండి శుక్రవారం ఉదయం విశాఖపట్నం వెళ్లారు. పవన్‌ కళ్యాణ్‌ను కార్యక్రమాలకు ఆహ్వానించేందుకు మంత్రి నారాయణ గురువారం రాయబారానికి వెళ్లినట్లు సమాచారం. అయినప్పటికీ ఆయన ప్రారంభోత్సవాలకు హాజరు కాలేదు. విశాఖపట్నంలో నిర్వహించిన ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. అమరావతిలో నిర్మించిన ఎమ్మెల్యేల క్వార్టర్ల విషయంలో భారీగా అంచనాలు పెంచి నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ గైర్హాజరు కావడం అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇప్పటికే మూడు కేబినెట్‌ సమావేశాలకు పవన్‌ కళ్యాణ్‌ దూరంగా ఉన్న నేపథ్యంలో తాజాగా అమరావతి ప్రారంభోత్సవాలకు కూడా హాజరు కాకపోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన గైర్హాజరుకు అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

Sthanikam

పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News