Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 11:34 AM

108 ఉద్యోగుల 16 డిమాండ్లు.. ప్రభుత్వానికి వినతి

02-08-2026 1,107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉద్యోగ భద్రత నుంచి వేతనాల పెంపు వరకు సమస్యల పరిష్కారం కోరుతున్న సిబ్బంది

హైదరాబాద్:

రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలకు వెన్నెముకగా నిలుస్తున్న 108 అంబులెన్స్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఉద్యోగ భద్రత, ప్రభుత్వంలో విలీనం, వేతనాల పెంపు, కాంట్రాక్ట్ విధానం రద్దు తదితర అంశాలతో కూడిన 16 ప్రధాన డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతను నిరంతరం నిర్వర్తిస్తున్నప్పటికీ, ఇప్పటికీ కనీస ఉద్యోగ భద్రత, చట్టబద్ధ హక్కులు, సరైన వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాన డిమాండ్లు.

తెలంగాణ 108 ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి.

కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలి.

కనీస వేతనాలతో పాటు ప్రతి నెల సకాలంలో వేతనాలు చెల్లించాలి.

పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి చట్టబద్ధ హక్కులను అమలు చేయాలి.

ప్రమాద భత్యం, నైట్ అలవెన్స్, యూనిఫాం అలవెన్స్ మంజూరు చేయాలి.

పదోన్నతులు, సర్వీస్ రూల్స్ అమలు చేయాలి.

ఉద్యోగుల సంక్షేమం, భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి.

డ్రైవర్ల కనీస వేతనాన్ని రూ.32,500కు పెంచాలి.

మిగిలిన డిమాండ్లను కూడా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి.

"ప్రాణాలు కాపాడుతున్నాం... మా సమస్యలూ పరిష్కరించండి"

రోజూ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న 108 ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు న్యాయం జరిగితే 108 అత్యవసర వైద్య సేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు అందుతాయని వారు పేర్కొన్నారు.

Sthanikam

108 ఉద్యోగుల 16 డిమాండ్లు.. ప్రభుత్వానికి వినతి

Article Image

మీ స్పందన? 13 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News