Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:00 PM

జనన–మరణ ధృవీకరణ పత్రాల జారీలో కొత్త నిబంధనలు

05-08-2026 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రెండేళ్లు దాటిన నమోదులకు కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి

పారదర్శకత, నకిలీ ధ్రువపత్రాల నివారణే లక్ష్యం

జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదులో పారదర్శకత పెంచడం, నకిలీ ధ్రువపత్రాల జారీని అరికట్టడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం జననం లేదా మరణం జరిగిన తేదీ నుంచి రెండేళ్లు దాటిన తర్వాత నమోదు చేయాలంటే ఇకపై జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జేఎంఎఫ్‌సీ) కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి కానున్నాయి.

అధికారుల వివరాల ప్రకారం, రెండేళ్లు దాటిన నమోదుల కోసం దరఖాస్తుదారు అఫిడవిట్‌తో పాటు అవసరమైన ఆధారాలను కోర్టులో సమర్పించాలి. విచారణ అనంతరం జేఎంఎఫ్‌సీ జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగానే సంబంధిత జనన–మరణ నమోదు అధికారి డిజిటల్ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.

కొత్త నిబంధనలు ప్రస్తుతం అమల్లో ఉన్న భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)-2023కు అనుగుణంగా అమలు కానున్నాయి.

ఆలస్యమైన నమోదులకు నిబంధనలు

21 రోజుల లోపు: ఎలాంటి రుసుము లేకుండా నమోదు.

21 నుంచి 30 రోజుల లోపు: నిర్ణీత ఆలస్య రుసుముతో నమోదు.

30 రోజుల నుంచి ఏడాది లోపు: ఆలస్య రుసుముతో పాటు సంబంధిత అధికారుల అనుమతితో నమోదు.

ఒకటి నుంచి రెండేళ్ల లోపు: సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) లేదా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతితో నమోదు.

రెండేళ్లు దాటితే: జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జేఎంఎఫ్‌సీ) కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి.

జనన ధ్రువీకరణ పత్రం పాఠశాల ప్రవేశాలు, ఆధార్, పాస్‌పోర్టు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వారసత్వ హక్కులు వంటి అనేక అవసరాలకు కీలకమైన పత్రం కాగా, మరణ ధ్రువీకరణ పత్రం బీమా, పెన్షన్, ఆస్తి, చట్టపరమైన వ్యవహారాలకు అత్యంత అవసరమని అధికారులు పేర్కొన్నారు.

జననం లేదా మరణం జరిగిన వెంటనే గ్రామ పంచాయతీ, గ్రామ/వార్డు సచివాలయం, మున్సిపాలిటీ లేదా నగర పాలక సంస్థలో నిర్ణీత గడువులో నమోదు చేయించి ధ్రువీకరణ పత్రం పొందాలని అధికారులు ప్రజలకు సూచించారు.

Sthanikam

జనన–మరణ ధృవీకరణ పత్రాల జారీలో కొత్త నిబంధనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News