Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:08 PM

మద్యం మత్తులో పోలీసులతో దురుసు.. నాలుగు రోజుల జైలు శిక్ష

27-07-2026 854 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలో వాహన తనిఖీల సందర్భంగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడి, విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పెద్దపురం రవీందర్‌ను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతడు 67 మి.గ్రా/100 మి.లీ. ఆల్కహాల్ సేవించినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశారు. కేసును విచారించిన స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అతనికి నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా సదాశివపేట ఇన్‌స్పెక్టర్ డి. వెంకటేష్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, పట్టుబడిన ప్రతి ఒక్కరినీ న్యాయస్థానం ముందు హాజరుపరిచి చట్టప్రకారం శిక్షలు విధించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ ప్రాణాలతో పాటు ఇతరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

మద్యం మత్తులో పోలీసులతో దురుసు.. నాలుగు రోజుల జైలు శిక్ష

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News