ఆందోల్ నియోజకవర్గంలో వట్‌పల్లి మండలం మేడికుంద గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలు 209, 210లో గర్భిణీలు, బాలింతలకు పోషణ మాసం ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాదేవి, అంజనబాయి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ప్రతిరోజూ పోషక విలువలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రోటీన్, ఇనుము, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఒమేగా-3 వంటి పోషకాలు లభించే ఆహారం తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించడంతో పాటు తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని తెలిపారు. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు వంటి పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యను తగ్గించడంతో పాటు కంటి చూపు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. గర్భధారణ సమయంలో పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తల్లులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయికృష్ణ, ఆయా పోచమ్మ, ఆశా కార్యకర్త స్వరూప, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.
మేడికుందలో ఘనంగా పోషణ మాసం అవగాహన కార్యక్రమం

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి