Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోటకొండూరులో బీఆర్‌ఎస్‌కు జోష్‌.. హరీష్‌రావుకు ఘన స్వాగతం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 06:18 AM

చౌటుప్పల్‌లో పేకాట శిబిరంపై దాడి: ఆరుగురి అరెస్ట్

21-09-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రూ.26 వేలు, 6 బైక్‌లు, 6 ఫోన్లు స్వాధీనం

మల్లికార్జుననగర్‌లోని ఒక ఇంట్లో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై బి.అజయ్ భార్గవ్ తన సిబ్బందితో కలిసి ఆదివారం రాత్రి 9:00 గంటల సమయంలో మల్లికార్జుననగర్‌లోని ఓ ఇంటిపై అకస్మాత్తుగా దాడి (రైడ్) చేశారు.​ఈ దాడిలో స్థానికంగా పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ ఇల్లు చౌటుప్పల్ టౌన్‌కు చెందిన రెడ్డగోని మల్లేష్‌దిగా గుర్తించారు. మిగిలిన నిందితులను అంతమ్మగూడెంనకు చెందిన రావుల లింగయ్య, పీపల్ పహాడ్‌ నల్లెంకి లింగస్వామి, ఆరెగూడెం దిండి రాఘవరెడ్డి, చౌటుప్పల్ టౌన్‌ తీగల రమేష్, బొంగు రమేష్‌లుగా గుర్తించారు.​నిందితుల వద్ద నుంచి రూ.26,000 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 06 ద్విచక్ర వాహనాలు (బైక్‌లు), 106 పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్‌లో పేకాట శిబిరంపై దాడి: ఆరుగురి అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News