మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో విజ్ఞప్తి
పెద్ద కొండూరు వద్ద నిమజ్జనానికి అనుమతి లేదు
చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని చిన్న కొండూరులోని 'బొమ్మల కుంట' చెరువులోనే చేపట్టాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మున్సిపాలిటీలోని 20 వార్డుల ప్రజలు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో నిర్వహించుకోవాలని కోరారు. విగ్రహాల నిమజ్జనాన్ని పెద్ద కొండూరు వద్ద కాకుండా, చిన్న కొండూరు బొమ్మల కుంట వద్దే నిర్వహించాలని స్పష్టం చేశారు. అక్కడ నిమజ్జనానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.భక్తులు, ఉత్సవ నిర్వాహకులు అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని.. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి