రామన్నపేట–పల్లెపహాడ్ రోడ్డుకు మరమ్మతులు చేయాలని డిమాండ్
రామన్నపేట: రామన్నపేట–పల్లెపహాడ్ ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దుబ్బాక, మునిపంపుల సర్పంచులు ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. దుబ్బాకలో రోడ్డుపై నీటితో నిండిన గుంతల్లో కూర్చొని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు.
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ.. రహదారి పూర్తిగా ధ్వంసమై భారీ గుంతలు ఏర్పడ్డాయని, వర్షాలకు గుంతల్లో నీరు నిలవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. విద్యార్థులు, వృద్ధులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం, గట్టు నర్సింహా మాట్లాడుతూ.. సమస్యను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. ముందుగా గుంతలను పూడ్చి, అనంతరం పూర్తిస్థాయి రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే జిల్లా కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, దుబ్బాక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి