ఆకట్టుకున్న పిల్లల నృత్య ప్రదర్శనలు..!
చిట్యాల పురపాలిక పరిధిలోని పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బోడ సుశీల ఆధ్వర్యంలో శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించారు.ప్రభుత్వ విద్యాశాఖ సూచన మేరకు ప్రతి మూడవ శనివారం నిర్వహించవలసిన ‘నో బ్యాగ్ డే ‘ లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇంకా వృత్యంతర శిక్షణ లో విద్యార్థులు రూపొందించిన అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అంతకు ముందు నిర్వహించిన పేరెంట్ టీచర్స్ సమావేశంలో పలువురు తల్లిదండ్రులు విద్యార్థుల పురోభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. గత నెలలో నూరుశాతం హాజరు కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి