వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు: ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్
రానున్న వినాయక నిమజ్జన మహోత్సవాన్ని పురస్కరించుకొని చౌటుప్పల్ లో పోలీసులు శనివారం భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. డీఎస్పీ పి.మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు చౌటుప్పల్ ఇన్ స్పెక్టర్ జి.మన్మధ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది, సాయుధ బలగాలు కలసి తంగడపల్లి గ్రామం నుంచి తంగడపల్లి చౌరస్తా వరకు ఈ మార్చ్ చేపట్టారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ... నిమజ్జన వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, ఉత్సాహంగా జరుపుకోవాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి