Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం: సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 04:41 PM

కోదాడ జాబ్‌మేళాకు యువత తరలింపు

కోదాడ జాబ్‌మేళాకు యువత తరలింపు

కోదాడ జాబ్‌మేళాకు యువత తరలింపు
19-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా నిరుద్యోగ యువతకు మంచి అవకాశమని తహసీల్దార్‌ లాల్‌ బహదూర్‌ శాస్త్రి అన్నారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆదేశాల మేరకు రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి యువతను జాబ్‌మేళాకు తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సును శనివారం ఆయన ప్రారంభించారు.

పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి ఆధ్వర్యంలో జరిగే జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో యువత కోదాడకు తరలివచ్చి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కోట ఉమారాణి, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ జమీరుద్దీన్‌, మొహమ్మద్‌ నాసర్‌, జెల్లా వెంకటేశం, గురికే శేఖర్‌, కేశవదాస్‌, వెంకటేశం, మొహమ్మద్‌ మన్సూర్‌, జీపీఓ కొమ్ము నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కోదాడ జాబ్‌మేళాకు యువత తరలింపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News