నార్కట్‌పల్లి జర్నలిస్టుల సంఘీభావం.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నార్కట్‌పల్లి జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు. శుక్రవారం నిర్వహించిన దీక్షలో జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్‌రెడ్డి, దోటి శ్రీనివాస్‌తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నార్కట్‌పల్లి టీయూడబ్ల్యూజే–ఐజేయూ మండల కమిటీ నాయకులు దీక్షకు మద్దతు ప్రకటించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ప్రజ్ఞాపురం శివశంకర్, మండల అధ్యక్షుడు పసునూరి చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షుడు బాసెట్టి శ్రీనివాస్, కోశాధికారి సోమ వెంకటరెడ్డి, సభ్యులు రాధారపు రమేష్, కన్నబోయిన నరసింహ, శిరిశెట్టి సంతోష్, గూడూరు అంజిరెడ్డి, కే. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి