ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం
నాగోల్: వినాయక ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ సూచించారు. బండ్లగూడలోని రాజీవ్ సహాభావన అపార్ట్‌మెంట్స్, తట్టి అన్నారంలోని అన్నవరపు సత్యనారాయణ కాలనీలో వినాయక మండపాల వద్ద పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.
వాహనదారులు హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్, అతివేగం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం చేయవద్దన్నారు. మండపాల వద్ద వాహనాలను రోడ్డుపై నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరగడమే పోలీసుల లక్ష్యం. ప్రజలు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సీఐ మక్బూల్ జానీ కోరారు.
కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లారెడ్డి, హెచ్‌సీలు నర్సింహ, దశరథ, ఎస్సై సూర్య, ఎస్‌జీహెచ్ సహచారి లక్ష్మీకవిత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి