పోస్టర్‌ను ఆవిష్కరించిన చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, సీఐ మన్మధ కుమార్
50కి పైగా కంపెనీలు.. 3,000 పైచిలుకు ఉద్యోగావకాశాలు
ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 27న తంగడపల్లిలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఆసరా ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఆసరా ఫౌండేషన్ చైర్మన్ బొల్ల శివశంకర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ఉద్యోగ మేళాకు సంబంధించిన గోడపత్రిక (పోస్టర్)ను చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, సీఐ మన్మధ కుమార్ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. సెప్టెంబరు 27న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తంగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈ మేళా జరుగుతుందన్నారు. ఇందులో దాదాపు 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని, 3,000కి పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయని వెల్లడించారు. ఐటీ (సాఫ్ట్‌వేర్), బీపీఓ తయారీ రంగం (మ్యానుఫ్యాక్చరింగ్)
ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్)బ్యాంకింగ్, రిటైల్–అమ్మకాలు, మార్కెటింగ్ మునుగోడు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీయువకులు తమ విద్యార్హతల ఆధారంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9030013084 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు దోర్నాల గజేందర్, సంగీశెట్టి ధనుంజయ్, సిలివేరు విజయ్, సింగం కృష్ణ, చామల చింటూ, సిలివేరు ప్రభాస్, గంజి స్వామి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి