హైదరాబాద్: సామాజిక జీవితంలో కాళోజీ నారాయణరావు ఓ శిఖరంలాంటి వ్యక్తి అని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు. కాళోజీ 112వ జయంతి సందర్భంగా శుక్రవారం యూనివర్సిటీలో స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, సమాజ అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు కాళోజీ అని పేర్కొన్నారు. వాడుక భాషలో రచనలు చేస్తూ ప్రజాకవిగా గుర్తింపు పొందారని తెలిపారు.
ప్రముఖ పాత్రికేయుడు, ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకుడు డా. కె. శ్రీనివాస్ ‘తెలంగాణ సాహిత్యం: ప్రజల గొడవ’ అంశంపై ప్రసంగిస్తూ.. కాళోజీ రచనలు సామాజిక అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజల గొంతుకగా నిలిచాయని అన్నారు. తెలంగాణ సాహిత్యం ప్రజల ఆకాంక్షలు, ఆవేదనలకు స్వరంగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమానికి అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించగా రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, పలువురు ప్రొఫెసర్లు, డీన్లు, డైరెక్టర్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి