Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతులందరూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులుగా చేరాలి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 06:16 PM

డీఈఓను మర్యాదపూర్వకంగా కలిసిన బి స్మార్ట్ జిల్లా కమిటీ

18-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి కలెక్టరేట్, సెప్టెంబర్ 18:

బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బి స్మార్ట్) యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కమిటీ సభ్యులు జిల్లా విద్యాధికారి బిక్షపతిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బి స్మార్ట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు డీఈఓను శాలువాతో సత్కరించి, మెమొంటో అందజేశారు.

నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు కొండూరి మల్లేశం గౌడ్, కోశాధికారి సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షురాలు తీగల జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఆబోతుల కీర్తి డీఈఓను కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొండూరి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ తరఫున సహాయ సహకారాలు అందించాలని కోరారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విషయంలో అధికారులతో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో బి స్మార్ట్ బీబీనగర్ మండల అధ్యక్షులు కోణార్కరావు, కాశీ విశ్వనాథ్, మంజు బాబా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డీఈఓను మర్యాదపూర్వకంగా కలిసిన బి స్మార్ట్ జిల్లా కమిటీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News