Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కిడ్నీ బాధితుడికి రూ.లక్ష ఎల్‌ఓసీ అందజేత అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 07:04 PM

రైతులందరూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులుగా చేరాలి

18-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రైతులు ఒకే తాటిపైకి వచ్చి సంఘటితంగా పనిచేసి ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ప్రోత్సహిస్తోందని గూడూరు సర్పంచ్ జగన్నాథ్, మనూర్ పీఏసీఎస్ కార్యదర్శి జనార్ధన్ తెలిపారు. శుక్రవారం మనూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో గూడూరు గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యత్వ అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు వ్యాపార దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులుగా చేరడం ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను సమష్టిగా కొనుగోలు చేసి సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. అలాగే పండించిన పంటలను మధ్యవర్తులు లేకుండా నేరుగా మార్కెట్‌లో లేదా కంపెనీలకు విక్రయించడం ద్వారా మెరుగైన ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్‌ వంటి సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, ప్రభుత్వ రాయితీలు, తక్కువ వడ్డీ రుణాల ద్వారా ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని వివరించారు. మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పీఏసీఎస్ మనూర్ రైతు ఉత్పత్తిదారుల సంస్థలో పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పరిసర గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులందరూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులుగా చేరాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News