Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం దీక్ష.. అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 08:00 PM

బాలికల కళాశాల సైన్స్‌ ల్యాబ్‌కు మరమ్మతులు..

18-09-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

బాలికల కళాశాల సైన్స్‌ ల్యాబ్‌కు మరమ్మతులు..

మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలతో కలెక్టర్‌ పరిశీలన..

నల్గొండ : స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని సైన్స్ ల్యాబ్‌కు త్వరలోనే మరమ్మతులు చేపడతామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. గురువారం జరిగిన 'తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం' వేడుకల్లో భాగంగా కళాశాల విద్యార్థినులు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలసి తమ సమస్యను విన్నవించారు. ల్యాబ్ భవనం పాతబడి పెచ్చులు ఊడిపోతుండటంతో ప్రమాదకరంగా మారిందని, కొత్తది మంజూరు చేయాలని కోరారు.

​విద్యార్థినుల వినతిపై తక్షణమే స్పందించిన మంత్రి... ల్యాబ్‌ను పరిశీలించి మరమ్మతులు చేపటాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ కళాశాలను సందర్శించారు. ల్యాబ్‌ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... మంత్రి ఆదేశాల మేరకు ల్యాబ్‌కు అవసరమైన మరమ్మతులు పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు, అంచనాలను వెంటనే సిద్ధం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దశ్రు నాయక్, కళాశాల ప్రిన్సిపల్ పద్మ తదితరులు ఉన్నారు.

Sthanikam

బాలికల కళాశాల సైన్స్‌ ల్యాబ్‌కు మరమ్మతులు..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News