ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి చొరవతో సీ ఎస్ఆర్ నిధుల మంజూరు
రైతుల ఇబ్బందులు తొలగించేందుకే పనులు: ఆకుల ఇంద్రసేనారెడ్డి
బండరావిరాల నుంచి పెద్ద కాపర్తి వరకు విస్తరించి ఉన్న పిలాయిపల్లి కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్క ఆకుల తొలగింపు పనులు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిల ప్రత్యేక చొరవతో 'దివిస్ లేబొరేటరీస్' యాజమాన్యం తమ సి ఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) నిధుల నుంచి రూ. 20 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపడుతున్న పనులను ఇరిగేషన్ ఈఈ రాధాకృష్ణ, డిఈ కృష్ణారెడ్డిలతో కలిసి చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి బండరావిరాల వద్ద శంకుస్థాపన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. కాలువలో గుర్రపుడెక్క తీవ్రంగా పేరుకుపోవడంతో సాగునీరు అందక చౌటుప్పల మండల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, దివిస్ యాజమాన్యంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారని పేర్కొన్నారు. రైతుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, దివిస్ యాజమాన్యానికి ఈ సందర్భంగా స్థానిక రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమిడి ప్రదీప్ జీ, పోచంపల్లి సింగిల్ విండో చైర్మన్ పాక మల్లేష్ యాదవ్, జూలూరు సింగిల్ విండో చైర్మన్ కళ్లెం రాఘవరెడ్డి, సింగల్ విండో వైస్ చైర్మన్ చెన్నగొని అంజయ్య గౌడ్, చౌటుప్పల్, పోచంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్, ఉప్పునూతల వెంకటేష్ యాదవ్, సర్పంచులు చిన్న కొండూరు తీగుళ్ల చంద్రయ్య, పోచంపల్లి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాసుల అంజయ్య గౌడ్, ఫిలాయిపల్లి సర్పంచ్ పెరుమాండ్ల మహాలక్ష్మి దానయ్య, మాజీ ఎంపీటీసీ బద్దం కొండల్ రెడ్డి, జిల్లా నాయకులు నల్ల నరేందర్ రెడ్డి, ఢిల్లీ శేఖర్ రెడ్డి, చేవెళ్లి కృష్ణ, సంతు, ఫకీరు యాద్ రెడ్డి, దివిస్ అధికారి గోపి, చౌటుప్పల్, పోచంపల్లి మండలాల రైతులు పాల్గొన్నారు,

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి