Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కిడ్నీ బాధితుడికి రూ.లక్ష ఎల్‌ఓసీ అందజేత అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 07:05 PM

నల్గొండ నీళ్లను తరలిస్తే ఊరుకునేది లేదు

నల్గొండ నీళ్లను తరలిస్తే ఊరుకునేది లేదు

నల్గొండ నీళ్లను తరలిస్తే ఊరుకునేది లేదు
18-09-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కాంగ్రెస్ పాలనపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధ్వజo .

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయలేక తీవ్ర ఫ్రస్ట్రేషన్‌లో ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. శుక్రవారం నకిరేకల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార మదంతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని లింగయ్య ఆరోపించారు. రెండు టర్మ్‌లు ఓడిపోయినా సంపాదించలేనంత డబ్బును కొద్ది నెలల్లోనే సంపాదించామని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిందని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

నల్గొండ రైతులకు సాగునీరు ఏది?

AMRP ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాకు రావాల్సిన నీటిని అందించకుండా ఎడమ కాలువ ద్వారా ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారని లింగయ్య ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల ఆదేశాలకు నల్గొండ జిల్లా ఇరిగేషన్ మంత్రి తలొగ్గుతున్నారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రాకు నీటిని తరలిస్తున్నా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు.

పంట చేతికి వచ్చే కీలక సమయంలో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి AMRP పరిధిలోని చెరువులు, కుంటలను నీటితో నింపాలని డిమాండ్ చేశారు.

దళితులపై వేధింపులు ఆపాలి

కాంగ్రెస్ పాలనలో దళితులపై వేధింపులు పెరిగాయని లింగయ్య ఆరోపించారు. నకిరేకల్ నియోజకవర్గంలోని ఇప్పలగూడెంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, వార్డు సభ్యులు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం షెడ్డు తొలగించారని, దీనిని ప్రశ్నించిన దళితులు, బీఆర్‌ఎస్ నాయకులపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తరలించారని ఆరోపించారు.

పోలీసులు రాజకీయ నాయకుల మెప్పు కోసం కాకుండా చట్టప్రకారం, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. నల్గొండ జిల్లాకు నీటి కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయంపై రైతుల తరఫున బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు.

Sthanikam

నల్గొండ నీళ్లను తరలిస్తే ఊరుకునేది లేదు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News