Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రెండో అంతస్తు నుంచి పడి విద్యార్థికి తీవ్రగాయాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 03:11 PM

బాల గణేష్ గణపతి మండపం వద్ద ఘనంగా అన్నదాన మహోత్సవం

18-09-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టపర్తి గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ గణపతి మండపం వద్ద ఘనంగా అన్నదాన మహోత్సవ దాత షేక్ సమద్ పాష కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ద్వారా భోజనాన్ని అందించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయడంతో భక్తులు ప్రశాంతంగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దాత సమద్ పాషా మాట్లాడుతూ... గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తి, సేవాభావంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బాల గణేష్ యూత్ సభ్యులు, భక్తులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

బాల గణేష్ గణపతి మండపం వద్ద ఘనంగా అన్నదాన మహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News