భువనగిరి: బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బి స్మార్ట్) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా కొండూరి మల్లేష్‌గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భువనగిరిలో బి స్మార్ట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డా. పగిడాల జలంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షుడిగా నోముల బసవరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా తీగల జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ఏ.కీర్తి, కోశాధికారిగా ప్యారి బేగంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులకు జలంధర్‌రెడ్డి నియామక పత్రాలు అందజేసి శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా జలంధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి బి స్మార్ట్ అండగా ఉంటుందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్ మాట్లాడుతూ తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న రాష్ట్ర, జిల్లా, మండల కమిటీ సభ్యులు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, కోశాధికారి ప్రభాకర్‌రెడ్డి, దశరథ్, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి