సమాజంలో మహిళలు, పిల్లల హక్కుల పరిరక్షణకు, గృహహింస నివారణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. 'సార్ప్' (సొసైటీ ఫర్ యాక్షన్ విత్ రూరల్ పూర్ ) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గృహహింస నివారణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, లింగ సమానత్వంపై నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ఆమె, పోచంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ కొయ్యాడ రజినితో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సార్ప్ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ ప్రమీల మాట్లాడుతూ.. బాలకార్మిక వ్యవస్థను అట్టడుగు స్థాయి నుంచి నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న హింసను అడ్డుకోవడంలోనూ, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించడంలోనూ స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో కీలకమని వివరించారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిలర్లు చింతల ఉమామహేశ్వరి సాయిలు, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యురాలు షేక్ నబీబి, పోచంపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు కర్నాటి వరలక్ష్మి, రాపోలు కావ్య, సూర్యపల్లి రాధికలతో పాటు స్వచ్ఛంద సంస్థ రిసోర్స్ పర్సన్ వినీల, సంస్థ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి