గొట్టిపాముల బాబూరావు
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి అధ్యక్షులు
పూస శ్రీనివాస్ పోలిటికల్ జేఏసీ చైర్మన్
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో: శ్రీనివాస్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని "తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి" అధ్యక్షులు గొట్టిపాముల బాబూరావు డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలోని అమరవీరుల సంస్మరణ స్థూపం వద్ద పూలమాలలు వేసి అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన "తెలంగాణ రాష్ట్ర సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో" ఆయన పాల్గొని మాట్లాడుతూ...తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిపేస్టో లో ప్రకటించిన ప్రకారం ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం,పెన్షన్,ఆరోగ్య భీమా,ఆర్టీసీ మరియు రైల్వేల్లో ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఉద్యమకారులను గుర్తించి వారికి సంస్థ ఆధ్వర్యంలో దృవీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. పొలిటికల్ జేఏసీ చైర్మన్ పూస శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను భువనగిరి జిల్లా కేంద్రనికి రప్పించి ఉద్యమకారుల డిమాండ్ లు తెలియజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి కొడారి వెంకటేష్, ఉపాధ్యక్షులు కొత్త బాలరాజు,సభ్యులు మాటూరి అశోక్,షేక్ హమీద్ పాషా, సున్నం నర్సింహ,సుర్వి శ్రీనివాస్,లెక్చలర్ ఫోరం కన్వీనర్ కొడిమాల కృష్ణ, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట నర్సింహ,భువనగిరి మాజీ మండలాద్యక్షులు అతికం లక్ష్మీనారాయణ గౌడ్,కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ,భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నిషంగి విద్యాసాగర్,అంగన్వాడీ జేఏసీ దంతూరి బాగ్యమ్మ,ఆటో జేఏసీ గొర్ల లక్ష్మణ్,విద్యార్థి జేఏసీ బి.నరేష్ నాయకులు వినోద్,బాలూ గౌడ్,అనిల్, మట్టా ఆంజనేయులు,బాలాచారి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి