నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం కమలాపూర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనం నిర్వహించే స్థలాన్ని గురువారం నారాయణఖేడ్ సబ్‌కలెక్టర్ ఉమా హారతి, డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్, తహసీల్దార్ విష్ణు సాగర్ ,మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా నిమజ్జనానికి వచ్చే భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సబ్‌కలెక్టర్ ఉమా హారతి అధికారులకు సూచించారు. చెరువు వద్ద భద్రత, వెలుతురు, రాకపోకలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు, మున్సిపల్, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానూర్ ఎస్‌ఐ కోటేశ్వరరావు, పోలీసు సిబ్బంది, సంబంధిత అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
కమలాపూర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి