పూజలు నిర్వహించిన వార్డు సభ్యురాలు శ్వేతా- ప్రవీణ్ యాదవ్
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం అయోధ్య నగర్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. తొమ్మిదవ వార్డు సభ్యురాలు జి.శ్వేతా- ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో మండపంలో ప్రతిష్టించిన గణనాథునికి ప్రత్యేక పూజలు, అర్చనా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి