రామన్నపేట: మండలంలోని ఉత్తటూరు గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ అధ్వానంగా మారి నిరుపయోగంగా ఉందని బీఆర్‌ఎస్ యువజన నాయకుడు మేడి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. హాల్ అభివృద్ధి కోసం 2018లో అప్పటి ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు.
దాదాపు ఎనిమిదేళ్లు గడిచినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కమ్యూనిటీ హాల్‌కు మరమ్మతులు చేపట్టి విద్యుత్, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఎస్సీ కుటుంబాలు, మహిళలు, యువత, ప్రజా కార్యక్రమాలకు ఉపయోగపడేలా హాల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. 2018లో ఇచ్చిన వినతిపత్రంపై ఇప్పటికైనా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని మేడి రాజు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి