చందనపల్లి: నల్గొండ జిల్లా చందనపల్లి గ్రామం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ లారీ కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కారు దెబ్బతిన్నట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
వారి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి