Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తంగడపల్లిలో 27న 'ఆసరా' మెగా ఉద్యోగ మేళా అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 04:03 PM

సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులకు అవకాశం మహిళలకు వ్యాపార శిక్షణ..డాక్టర్ బి. ధర్మ నాయక్

18-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపాధి ఆధారిత నూతన కోర్సులకు ప్రాధాన్యం.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఎఓయూ)లో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ నోడల్ అధికారి డాక్టర్ బి. ధర్మ నాయక్ తెలిపారు. శుక్రవారం రామన్నపేటలోని డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రంలో కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ధర్మ నాయక్ మాట్లాడుతూ బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 30 చివరి తేదీ అని తెలిపారు. ఆదివాసీలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు ఉచితంగా ఉన్నత విద్య అభ్యసించే అవకాశం ఉందన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మహిళలకు వ్యాపారాభివృద్ధి శిక్షణ

మహిళా విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎఓయూ–వీహబ్ ఆధ్వర్యంలో వ్యాపారాభివృద్ధి, నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నట్లు తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా నూతన కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో టీసీఎస్, ఐకాన్, రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్, రాశి, వి-హబ్ తదితర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కళాశాలలోనే సైన్స్ ప్రాక్టికల్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Sthanikam

సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులకు అవకాశం మహిళలకు వ్యాపార శిక్షణ..డాక్టర్ బి. ధర్మ నాయక్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News