తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశంతో పాటు నూతన యూనియన్ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం అందోలు మండలం మరవెల్లి గ్రామంలోని శివ పార్వతుల ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేశం ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు నూతన యూనియన్ ఐడీ కార్డులను అందజేశారు. జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యత, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణతో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉంటూ వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి జాతీయ సలహాదారు శెట్టి అమృతతో పాటు ముఖ్య అతిథులుగా జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ వీరు మల్లప్ప, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల వైద్యనాథ్, రాంసాన్పల్లి ఉపసర్పంచ్ పృథ్వి సాగర్ రెడ్డి, ఉపసర్పంచ్ వెండికోల్ భూమయ్య, మాజీ విద్యా కమిటీ చైర్మన్ జుట్టు నరసింహులు, మాజీ ఉపసర్పంచ్ మంగలి వీరయ్య హాజరయ్యారు.అలాగే నేషనల్ జాయింట్ సెక్రటరీ టి. సంగమేశ్వర్, నేషనల్ పబ్లిసిటీ సెక్రటరీ కే. సంగమేశ్వర్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వి. వెంకటేశం, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బి. కృష్ణ, రాష్ట్ర సెక్రటరీ ఎం. నాగేష్, జాయింట్ సెక్రెటరీ మన్నె పోచయ్య, రాష్ట్ర అడ్వైజర్ బి. సంగమేశ్వర్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సిహెచ్. బస్వరాజ్, వైస్ ప్రెసిడెంట్ టి. నాగరాజు, క్యాషియర్ కే. మల్లేశం గౌడ్, జనరల్ సెక్రటరీ జె. రాజు, జిల్లా అడ్వైజర్ శ్రీనివాస్ నాయక్, జిల్లా సభ్యుడు పవన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా యూనియన్ సభ్యులు శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ వినోద్ చారి, కమిటీ సభ్యులతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం నూతన సభ్యులు, జర్నలిస్టులకు యూనియన్ ఐడీ కార్డులను అందజేసి, జర్నలిస్టుల సంక్షేమం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.
జర్నలిస్టుల ఐక్యతకు మరో ముందడుగు.. నూతన యూనియన్ ఐడీ కార్డుల పంపిణీ

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి