విద్యార్థి భవిష్యత్తుకు బాటలు వేసే శిల్పి గురువు..
ఆర్.సి.ఓ గౌతమ్ కుమార్ రెడ్డి
పాఠశాల,కళాశాల ప్రిన్సిపల్ బి. శిరీష రెడ్డి
చౌటుప్పల్ మండలం,తూప్రాన్ పేట గ్రామ పరిధిలోని ఎంజేపీటీ పాఠశాల, కళాశాలలో శనివారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ప్రిన్సిపల్ శిరీష రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్.సి.ఓ గౌతమ్ కుమార్ రెడ్డి హాజరై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఒక విద్యార్థి భవిష్యత్తుకు బాటలు వేసే శిల్పి గురువు అని, మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే ఆజన్మకు ఒక సార్ధకతను, మంచి మార్గాన్ని చూపించేవాడు గురువు అని వివరించారు. సాధారణ ఉపాధ్యాయ స్థాయి నుండి భారతదేశం మొదటి పౌరుడు రాష్ట్రపతి వరకు అంచలంచలుగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత చరిత్ర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా తోటి విద్యార్థులకు బోధన చేశారు. కలెక్టర్, డీఈఓ, ఎంఈఓ, పాఠశాల చైర్మన్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులుగా వ్యవహరించిన విద్యార్థులను ఆర్ సి ఓ, ప్రిన్సిపాల్ లు అభినందించి వారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకొని పాఠశాల, కళాశాల విద్యార్థులు విశిష్ట అతిథి ఆర్సిఓ గౌతమ్ కుమార్ రెడ్డిని, ప్రిన్సిపల్ శిరీష రెడ్డిని, పాఠశాలలోని ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించి వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని పంచే శిల్పి అని, విద్యతోనే ప్రతి ఒక్కరూ రాణించటం జరుగుతుందని... విద్య నేర్పిన గురువును, జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పటికీ మరవకూడదని పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా తమ అనుభవాన్ని తోటి విద్యార్థులతో పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏటీపీలు జి. రవికుమార్, జి .మహేందర్ రెడ్డి, బి.డబ్ల్యు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి