Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీఎం సభ వేళ.. మాజీ ఎమ్మెల్యే హౌస్‌ అరెస్ట్‌ నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 01:29 PM

సీఎం సభ వేళ.. మాజీ ఎమ్మెల్యే హౌస్‌ అరెస్ట్‌

05-09-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

శుభకార్యాలకు వెళ్లాల్సి ఉందంటూ పోలీసులతో చిరుమర్తి లింగయ్య వాగ్వాదం.

నకిరేకల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నకిరేకల్‌ నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుడు చిరుమర్తి లింగయ్యను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సీఎం సభకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

తనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించడంపై చిరుమర్తి లింగయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను పలు శుభకార్యాలకు హాజరు కావాల్సి ఉందని, బయటకు వెళ్లేందుకు అనుమతించాలని పోలీసులను కోరుతూ వారితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అయితే సీఎం పర్యటన పూర్తయ్యే వరకు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది.

సీఎం సభ నేపథ్యంలో నకిరేకల్‌ నియోజకవర్గంలో పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు ముందస్తుగా అప్రమత్తం చేయడంతో పాటు, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Sthanikam

సీఎం సభ వేళ.. మాజీ ఎమ్మెల్యే హౌస్‌ అరెస్ట్‌

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News