Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధ్యాయుడే సమాజానికి దిక్సూచి భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 07:09 PM

నకిరేకల్‌లో ఘనంగా ప్రజాపాలన వికాస సభ.

నకిరేకల్‌లో ఘనంగా ప్రజాపాలన వికాస సభ.

నకిరేకల్‌లో ఘనంగా ప్రజాపాలన వికాస సభ.
05-09-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నుంచి భారీగా తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు

నకిరేకల్‌ నియోజకవర్గ కేంద్రంలో శనివారం నిర్వహించిన వెయ్యి రోజుల ప్రజాపాలన వికాస సభకు రామన్నపేట మండలం నుంచి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అభిమానులు 60 వాహనాల్లో సుమారు 8,500 మంది సభకు హాజరైనట్లు మండల అధ్యక్షుడు పున్న జగన్మోహన్‌ తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నకిరేకల్‌లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని జగన్మోహన్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. ఒకవైపు అప్పులు చెల్లిస్తూనే.. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.

కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అందకపోయినా అందుబాటులో ఉన్న బడ్జెట్‌తో సమగ్ర ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నకిరేకల్‌లో ఘనంగా ప్రజాపాలన వికాస సభ.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News