Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వయం ఉపాధితోనే ఆర్థిక పురోగతి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 09:18 PM

రామన్నపేట ఆసుపత్రిని 100 పడకలకు పెంచాలి. సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి: ఎం.డి. జహంగీర్

04-09-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి, నూతన భవన నిర్మాణానికి అసెంబ్లీ సమావేశాల్లో నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆసుపత్రి ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

ఆసుపత్రిలో సరిపడా పడకలు, వైద్య సిబ్బంది, మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నకిరేకల్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి 100 పడకల ఆసుపత్రిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. మంత్రి కోమటిరెడ్డి ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని ప్రకటించి రెండు నెలలు గడిచినా పురోగతి లేదని విమర్శించారు. ఆసుపత్రి అభివృద్ధి జరిగే వరకు ప్రజలతో కలిసి ఉద్యమం కొనసాగిస్తామని జహంగీర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శివర్గ సభ్యులు కందుల హనుమంతు, కల్లూరి నగేష్, మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బుర్రు అనిల్‌కుమార్, మండల నాయకులు గొరిగే సోములు, గాదె నరేందర్, నీల అయిలయ్య, తోలుపునూరి శ్రీనివాస్, శాఖ కార్యదర్శి మునికుంట్ల లెనిన్, డీవైఎఫ్ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము, పల్లె సత్యం, బావండ్లపల్లి సత్యం, ఎండీ లతీఫ్, ఆముద ఆంజనేయులు, జల్లెల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట ఆసుపత్రిని 100 పడకలకు పెంచాలి. సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి: ఎం.డి. జహంగీర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News