కాంగ్రెస్ శ్రేణులకు గోలి నరేష్ పిలుపు.
చిట్యాల: నకిరేకల్‌లో ఈ నెల 5న నిర్వహించనున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు గోలి నరేష్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా నకిరేకల్ నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
నియోజకవర్గంలో ఇప్పటికే చేపట్టిన, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.గ్రామాలు, మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలు ప్రజలను సమీకరించి సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని గోలి నరేష్ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి