మంచినీరు, విద్యుత్ అంతరాయంపై మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ వినతి.
చిట్యాల: కృష్ణాష్టమి, బోనాల పండుగల నేపథ్యంలో చిట్యాల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు అన్ని సదుపాయాలు కల్పించాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు చిట్యాల మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
పండుగల సందర్భంగా పట్టణంలో మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడడంతో పాటు విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశుద్ధ్యం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శీను, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మాస శ్రీనివాస్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రవరం లింగస్వామి, సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరేళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు జయరాపు రామకృష్ణ, సీనియర్ నాయకుడు కంచర్ల శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి