సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1000 రోజులు పాలన ముగిసినందున హామీలు అమలు కాకపోవడంతో సమరభేరి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల నుంచి బిఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున తరలి వచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల విఫలం పాలన పై తుంగతుర్తి పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కామెంట్స్..
సీఎం రేవంత్ రెడ్డి పై గాదరి కిషోర్ కుమార్ మండిపడ్డారు
వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది శూన్యం
నీ కుర్చీ కాపాడుకోవడానికి నీకు టైం సరిపోతుంది.. రాష్ట్రానికి నువ్వేం చేస్తాం
బిజెపి పార్టీ లోకి పోవడానికి రేవంత్ రెడ్డి సన్నద్ధం అవుతున్నారు
నీ కుర్చీ కాపాడుకోవడం కోసం..కెసిఆర్ ను తిడుతున్నావు
సీఎం రేవంత్ రెడ్డి కుర్చీని మార్చడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుంది
సీఎం రేవంత్ రెడ్డి నీకు బుద్ధి రావాలంటే మాజీ సీఎం కేసీఆర్ ఫోటో పెట్టుకుని దండం పెట్టు 45 రోజులు నిష్టగా ఉంటే నీకు బుద్ధి వస్తుంది
బిఆర్ఎస్ హయాంలో తుంగతుర్తిలో 24 గంటలు కాలువ నీళ్లు ఇచ్చి రైతన్నలకు అండగా ఉంది
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి