Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. హామీల అమలులో ఘోర వైఫల్యం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 08:31 PM

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. హామీల అమలులో ఘోర వైఫల్యం

02-09-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

డా. సుర్కంటి శ్రీధర్ రెడ్డి

మునుగోడులో బీఆర్‌ఎస్ ధర్నా..

ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేక ఘోరంగా విఫలమైందని యాదాద్రి భువనగిరి జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, మందోళ్లగూడెం ఉపసర్పంచ్ డా. సుర్కంటి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన మునుగోడు పట్టణంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ​రైతుబంధు, రైతు రుణమాఫీ, యూరియా కొరత, పింఛన్ల చెల్లింపుల్లో అలసత్వం వల్ల రాష్ట్రంలోని రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చాక సాగిస్తున్న పాలనకు అసలు పొంతనే లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వెంటనే నెరవేర్చాలని, దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మానే రవికుమార్, మాజీ సర్పంచ్ బక్క శంకరయ్య, మాజీ ఉపసర్పంచ్ బోరం ప్రకాష్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఇట్టబోయిన శంకరయ్య, పాపగల రామచంద్రం, కళ్లెం రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. హామీల అమలులో ఘోర వైఫల్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News