Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ సారాంపల్లి మల్లారెడ్డి కి ఘననివాళులు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 06:51 PM

మాజీ ఎమ్మెల్యే భరోసాతోనే నా(ఆ)గం అయితుండా?

02-09-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్గొండ రాజకీయంలో సోషల్ మీడియా దూకుడు!

మాజీ ఎమ్మెల్యే భరోసాతోనే నా(ఆ)గం అయితుండా?

యువ నేత వ్యవహారశైలిపై సొంత పార్టీలోనే చర్చ!

బిజెపి సోషల్ మీడియానే ప్రచార అస్త్రంగా ఎంచుకున్నదా.!

వరుస వివాదాలు గొడవలు, ఉద్రిక్తతల మధ్య బిజెపి పార్టీ పై ప్రజల్లో నమ్మకం సన్నిగిల్లుతోందా?

నల్గొండ : నల్గొండ జిల్లా రాజకీయాల్లో నా(ఆ)గం వ్యవహారశైలి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం కంటే వివాదాలు, ఆందోళనల ద్వారా సోషల్ మీడియాలో మైలేజ్ పొందడమే ధ్యేయంగా సదరు నేత అడుగులు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న సమస్య తలెత్తినా కెమెరాల ముందు లైవ్‌లు, రీల్స్‌తో హడావుడి చేస్తూ గ్రౌండ్ పాలిటిక్స్ కంటే డిజిటల్ ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరుస వివాదాలు గొడవలు ఉద్రిక్తతలు...

​గణనాథుడి మండపం వివాదం నుంచి ఇటీవల జరిగిన ఫ్లెక్సీల దహనం వరకు వరుస సంఘటనల్లో ఈ యువ నేత పేరు ప్రముఖంగా వినిపించింది. పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగుతూ ఉద్రిక్త వాతావరణం సృష్టించడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నారా లేక రాజకీయ లబ్ధి కోసమే ఈ రచ్చ చేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, పార్టీ సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ఎజెండాకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సొంత పార్టీకి చెందిన నేతల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం.

మాజీ ఎమ్మెల్యే భరోసాతోనే నా(ఆ )గం అయితుండా?

​నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అండదండలతోనే ఈ నా(ఆ)గం మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. "నువ్వు ముందుకెళ్లు.. నేను వెనుకున్నా" అంటూ మాజీ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారనే వార్తలు స్థానిక రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి. గతంలో ఫ్లెక్సీల ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందడంతో, తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుని మాజీ ఎమ్మెల్యే ప్రశంసలు అందుకున్నారు. అయితే, ప్రస్తుతం బిఆర్ఎస్ వర్గాల మద్దతు తో సదరు యువ నేత మళ్లీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం విమర్శలకు తావిస్తోంది. బిఆర్ఎస్ నేత కంచర్ల, బిజెపి జిల్లా అధ్యక్షుడి మధ్య కనిపిస్తున్న ఈ 'రాజకీయ దోస్తీ' ని నిన్న జరిగిన మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చేర్మన్ కాంగ్రెస్ నాయకులు

'మగ వ్యభిచారలుగా' వర్ణించారు. ఇరు పార్టీల మధ్య సఖ్యత వల్ల

నల్గొండలో కొత్త సమీకరణాలకు తెరలేపుతోందా! అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బిజెపి జిల్లా అధ్యక్షుడితో బీఆర్ఎస్ నేత సన్నీహిత్యంపై సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. రెండు వేర్వేరు పార్టీల నేతల మధ్య ఈ రకమైన సాన్నిహిత్యంపై ఇరు పార్టీల అధిష్టానాల వైఖరి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మాజీ ఎమ్మెల్యే అండ, సోషల్ మీడియా హడావుడితో ముందుకు సాగుతున్న ఆ యువ నేత తదుపరి రాజకీయ అడుగులు ఏటువైపు పడతాయోనని జిల్లా ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Sthanikam

మాజీ ఎమ్మెల్యే భరోసాతోనే నా(ఆ)గం అయితుండా?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News