నిధులు మంజూరు చేసింది కేసీఆర్ సర్కార్.. పనులు చేపట్టింది బీఆర్‌ఎస్ : చిరుమర్తి లింగయ్య.
నకిరేకల్: నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు మంజూరు చేసి, నిర్మాణానికి శ్రీకారం చుట్టింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నకిరేకల్ ఇన్‌చార్జి చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. 2022 జనవరి 22న జారీ చేసిన G.O.Rt.No.27 ద్వారా రూ.38.35 కోట్లతో ఆసుపత్రికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
తన ఎమ్మెల్యే హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ సహకారంతో పనులు ప్రారంభించి, నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లామని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేసి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాల్సింది పోయి, పాత పనులకు ప్రారంభోత్సవాలు చేస్తూ క్రెడిట్ తీసుకుంటోందని విమర్శించారు.
‘నిధులు తెచ్చింది ఎవరు.. పనులు ప్రారంభించింది ఎవరు.. 80 శాతం పూర్తి చేసింది ఎవరు?’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాత పనులకు కొత్త రంగులు వేయడం కాకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత నకిరేకల్ నియోజకవర్గానికి కొత్తగా మంజూరు చేసిన అభివృద్ధి పనుల జీవోలను ప్రజల ముందు పెట్టాలని సవాల్ చేశారు. ప్రజలకు ప్రచారం కాదని.. కొత్త అభివృద్ధి పనులు కావాలని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి