Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భద్రతకు ‘ఎల్ఐసీ’యే కొండంత అండ: వాసవి కన్‌స్ట్రక్షన్స్ ఎండీ విజయ్‌కుమార్ ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 07:26 PM

రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాం

01-09-2026 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కుమ్మరికుంట్ల వేణుగోపాల్‌ అన్నారు. రాహుల్‌గాంధీపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తూ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాజ్యాంగం, సామాజిక న్యాయం, దళితుల ఆత్మగౌరవం వంటి అంశాలపై ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేసులతో రాహుల్‌గాంధీ గొంతును అణచివేయడం సాధ్యం కాదని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయం ఎదుట రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్‌గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Sthanikam

రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News