సౌత్ జోనల్ కార్యాలయంలో ఘనంగా 70వ వార్షికోత్సవాలు
ప్రజల జీవితాలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ ఎల్ఐసీ సమాజంలో చెరగని ముద్ర వేసిందని వాసవి కన్‌స్ట్రక్షన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యర్రం విజయ్‌కుమార్ పేర్కొన్నారు. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) 70వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం దక్షిణ మండల (సౌత్ జోనల్) కార్యాలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలకు విజయ్‌కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎల్ఐసీ అంటేనే నమ్మకం, విశ్వాసానికి ప్రతీక అని కొనియాడారు. త్వరలోనే ఈ సంస్థ శతాబ్ది ఉత్సవాలు కూడా జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, భవిష్యత్తు అవసరాలకు ఎల్ఐసీని మించిన సురక్షితమైన మార్గం మరొకటి లేదన్నారు. సంస్థ వృద్ధికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ఏజెంట్లు, ఉద్యోగులు, అధికారులను ప్రశంసించారు. కౌటికె విఠల్ మాట్లాడుతూ... ఎల్ఐసీ విజయ ప్రస్థానంలో ఏజెంట్లే కీలకమని, వారే సంస్థకు అసలైన ముఖచిత్రమన్నారు. పాలసీదారులకు, సంస్థకు మధ్య ఏజెంట్లు వంతెనలా పనిచేస్తున్నారని చెప్పారు. ఏజెంట్లు ఉత్సాహంగా పనిచేస్తే సంస్థ మరింత ఎత్తుకు ఎదుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల పరిధిలోని రీజనల్ మేనేజర్లు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి