ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని, సంపూర్ణ రుణమాఫీ జరగలేదని అన్నారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించాలని, వికలాంగులకు పెంచుతామని ప్రకటించిన పింఛన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు విడనాడకపోతే రానున్న రోజుల్లో ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈరి వీరన్న, పవన్‌కళ్యాణ్, జిల్లా కమిటీ సభ్యులు మీసాల సైదులు, వేముల పెద్ద నరసయ్య, జిల్లా నాయకులు కుచం రామారావు, నూకపంగు వైభవ్, షేక్ నసీరుద్దీన్, వెంకటేశ్వర్లు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి