Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భద్రతకు ‘ఎల్ఐసీ’యే కొండంత అండ: వాసవి కన్‌స్ట్రక్షన్స్ ఎండీ విజయ్‌కుమార్ ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 07:41 PM

పాత పెన్షన్‌ పునరుద్ధరించాలి

పాత పెన్షన్‌ పునరుద్ధరించాలి

పాత పెన్షన్‌ పునరుద్ధరించాలి
01-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఎన్‌జీ కళాశాలలో నల్ల బ్యాడ్జీలతో పెన్షన్‌ విద్రోహ దినం.

నల్లగొండ: పాత పెన్షన్‌ విధానాన్ని వెంటనే పునరుద్ధరించడంతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీజీసీటీఏ పిలుపు మేరకు కళాశాల ప్రాంగణంలో శాంతియుతంగా పెన్షన్‌ విద్రోహ దినాన్ని పాటించారు.

ఈ సందర్భంగా టీజీసీటీఏ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డా. ఎం. అనిల్‌ అబ్రహం మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని కోరారు.

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించకపోతే ఈ నెల 17న సామూహిక పోరాటానికి దిగుతామని ఆయన హెచ్చరించారు. తమ పోరాటానికి మద్దతు ప్రకటించిన ఓపీఎస్‌ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో అధ్యాపకులు డా. అనిల్‌ కుమార్‌, డా. మల్లేశం, డా. ఎం. శ్రీనివాస్‌ రెడ్డి, నాగరాజు, డా. జ్యోత్స్న, శివరాణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పాత పెన్షన్‌ పునరుద్ధరించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News