Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:08 PM

చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

31-08-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘చేయూత’ పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ గడువును వచ్చే నెల (సెప్టెంబర్) 15వ తేదీ వరకు పొడిగించినట్లు చౌటుప్పల్ పురపాలక వర్గం ప్రకటించింది. ఈ మేరకు పురపాలక చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ​హైదరాబాద్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియతో పాటు, దివ్యాంగుల నుంచి పెద్దఎత్తున వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని అర్హులైన ప్రజలందరూ ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇప్పటివరకు చేయూత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోని అర్హులు సెప్టెంబర్ 15, 2026 లోపు తమ వివరాలను సమర్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సమాచారం చేరేలా పురపాలక అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని చైర్‌పర్సన్, కమిషనర్ కోరారు.

Sthanikam

చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

Article Image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘చేయూత’ పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ గడువును వచ్చే నెల (సెప్టెంబర్) 15వ తేదీ వరకు పొడిగించినట్లు చౌటుప్పల్ పురపాలక వర్గం ప్రకటించింది. ఈ మేరకు పురపాలక చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ​హైదరాబాద్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియతో పాటు, దివ్యాంగుల నుంచి పెద్దఎత్తున వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని అర్హులైన ప్రజలందరూ ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇప్పటివరకు చేయూత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోని అర్హులు సెప్టెంబర్ 15, 2026 లోపు తమ వివరాలను సమర్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సమాచారం చేరేలా పురపాలక అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని చైర్‌పర్సన్, కమిషనర్ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News