Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆరాధ్య నూతన వస్త్రధారణ వేడుకలో పాల్గొన్న అబ్దుల్ రహీం, గైని సాయిలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:24 PM

వ్యక్తిగత భూముల కోసం ప్రభుత్వ భూమిలో రోడ్డు.. చర్యలు తీసుకోవాలి

31-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండలం పీర్లతాండా వద్ద ప్రభుత్వ అసైన్డ్ భూమిలో అక్రమంగా రోడ్డు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షులు అనుముల తుకారాం కోరారు. సోమవారం ఖేడ్ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో సబ్‌కలెక్టర్ ఉమాహారతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీర్లతాండా వద్ద సర్వే నంబర్ 120/50 నుంచి కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత భూములకు వెళ్లేందుకు సుమారు 40 అడుగుల వెడల్పుతో ప్రభుత్వ అసైన్డ్ భూమిలో అక్రమంగా రోడ్డు నిర్మిస్తున్నారని తెలిపారు. గతంలో అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ చంద్రమోహన్‌రెడ్డి, నాయబ్ తహసీల్దార్ రాజు పాటిల్, గిర్ధావర్ మాధవరెడ్డి అక్కడికి వెళ్లి పనులను నిలిపివేసినప్పటికీ తిరిగి రోడ్డు పనులు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై పాతులోత్ ప్రేమ్‌సింగ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్మిస్తున్న రోడ్డు వల్ల తాండా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, కొందరి వ్యక్తిగత భూములకు మాత్రమే ఉపయోగపడేలా రోడ్డు వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అసైన్డ్ భూమిని అక్రమంగా వినియోగిస్తున్న వారిపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అనుముల తుకారాం సబ్‌కలెక్టర్‌ను కోరారు.

Sthanikam

వ్యక్తిగత భూముల కోసం ప్రభుత్వ భూమిలో రోడ్డు.. చర్యలు తీసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News